డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ కోనసీమజిల్లా కొత్తపేట గ్రామంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీ.డీ.పీ. రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు సత్యానంద రావు ముఖ్య అతిథిగా విచ్చేసారు. తొలతగా ఆయన ప్రముఖ శిల్పి రాజ్ కుమార్ వడయార్ శిల్పకళా నందు ఉన్న స్వామి వివేకానందుని విగ్రహానికి పూల దండలు వేసి ఘన నివాళి అర్పించారు. తరువాత 10 నిమిషాల పాటు మౌనం పాటించారు.
వివేక నందుడు చేసిన మంచి పనులు, సేవలు గుర్తుతేచ్చుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వివేకనందుడుని స్పూర్తిదయకంగా తీసుకొని ప్రతీ యువత ఆనయ బాటలో పయనించాలని అన్నారు. ఈ కార్యక్రమానికి టీ.డీ.పీ. రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు, టీ.డీ.పీ. కార్యకర్తలు, తదితరులు పాల్గొని కార్యాక్రమిన్ని విజయవంతం చేశారు.

