Exclusive

స్కాలర్ షిప్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించిన మలబార్…

WhatsApp Image 2024-02-06 at 8.40.11 PM

ప్రముఖ బంగారం వజ్రాల వ్యాపార సంస్ధ మలబార్ చారిటబుల్ ట్రస్టు సామాజిక అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. అందులో భాగంగా మంగళవారం కాకినాడలో జగన్నాధపురం అన్నవరం సత్యవతి మహిళా కళశాలలో ప్రముఖ బంగారం వజ్రాల వ్యాపార సంస్ధ మలబార్ చారిటబుల్ ట్రస్టు సామాజిక సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా పరిధి గ్రామాల్లో ప్రభుత్వ కళాశాల్లో చదువుతున్న పేద విద్యార్థినిలు, తల్లిని గానీ తండ్రిని గానీ కోల్పోయిన వారు చదువుల్లో ప్రతిభావంతులకు ఈ స్కాలర్ షిప్స్ పంపిణీ కార్యక్రమాని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతథిగా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ జే. వెంకటరావు విచ్చేసారు. ఆయన మాట్లాడుతూ… దాతల ఔదార్యానికి అనుగుణంగా విద్యార్థులు లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి ఉన్నత శిఖరాలు అధిరోహంచి సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకోవాలన్నారు.

 

 

జిల్లా విద్యాశాఖ అధికారిణి, ఆర్జేడీ నాగమణి వ్యాపారంలో వచ్చిన లాభాల్లో పేదలకు తమవంతు సహకారం అందిస్తన్న మలబార్ సంస్థ చైర్మన్ ఎం.పి.అహ్మద్ సేవలు అభినందనీయం అని కొనియాడారు. అనంతరం కాకినాడ మలబార్ షోరూం మేనేజర్ శ్రీకాంత్ సారథ్యంలో డిజిటల్ చెక్ ను విద్యార్థినీ లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా కళాశాల ప్రిన్సిపాల్ చింతా నారాయణ మూర్తి. పలు జూనియర్ కాలేజి అధ్యాపకులు విద్యార్థుల తలిదండ్రులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.