ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. జౌన్పూర్ జిల్లాకు చెందిన సరాయ్ ఖ్వాజా పోలీస్ స్టేషన్ పరిధి జప్తాపూర్ మార్కెట్లో ఒక తల్లి ఒక కొడుకు ను ఒక స్కార్పియో కారు వేగంగా ఢీ కొట్టింది. వారు రోడ్డు దాటుతుండగా అటువైపు వెళ్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దూ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించి ఆ డ్రైవర్ పై కేసు నమోదు చేసారు. పరారీలో ఉన్న అతన్ని గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
స్కార్పియో కారు ఢీ… వారు స్పాట్ డెడ్…!!!

