తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ లోని మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎం.పీ. నిధుల ద్వారా రూ. 10 లక్షలతో సోలార్ పవర్ జనరేషన్ సిస్టం నిర్మించారు. దానిని ఎం.పీ. బండి సంజయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… త్వరలో మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థుల కోసం కేంద్ర నిధులతో ప్రత్యేక హాస్టల్ నిర్మించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చాను.
కరీంనగర్ ప్రజల ఆశీస్సులతో మళ్లి కరీంనగర్ నియోజకవర్గానికి ఎం.పీ. గా గెలుస్తే ఉమెన్స్ హాస్టల్ ను కట్టించే బాధ్యత తీసుకుంటాన్నారు. శాతవాహన వర్శిటీకి 12-బీ హోదా, ఎస్.ఆర్.ఆర్. కాలేజికి కూడా అటానమస్ హోదా కల్పించింది ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఉమెన్స్ కాలేజ్ ను అన్ని విధానాలుగా అభివృద్ది చేస్తాన్నారు.

