తెలంగాణ రాష్ట్రం నుంచి 2024 లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పోటీ చేయాల్సిందిగా ఆహ్వానిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ సందర్బంగా కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ… తెలంగాణ నుండి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయవలసిందిగా సోనియా గాంధీని ఆహ్వానిస్తూ మేము ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించామని అన్నారు.
ఇటీవలి ఎన్నికల ప్రచారంలో సోనియా గాంధీని “తెలంగాణ తల్లి” అని పేర్కొన్న తరువాత ఈ నిర్ణయం తీసుకున్నమన్నారు. ఈ ప్రాంతంతో ఆమెకు శాశ్వత అనుబంధం ఉందన్నారు. తెలంగాణ నుంచి పోటీ చేయాలనే పార్టీ కోరికను తెలియజేస్తూ లేఖను రాసామని, దానిని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీకి పంపుతామని అలీ తెలిపారు.

