కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో ఏ.పీ. మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ సెక్యూరిటీ గార్డ్స్, వర్కర్స్ యూనియన్ ఏ.ఐ.టీ.యూ.సీ. అనుబంధ సంఘం కాకినాడ కమిటీ సమావేశన్ని యూనియన్ అధ్యక్షులు కే. వి. రామయ్య అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ఏ.ఐ.టీ.యూ.సీ. జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఏ.పీ. మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ బ్రాంచ్ అధ్యక్షులు కె. మోహన్ రావు ముఖ్య అతిథులుగా విచ్చాశారు.
ఈ సందర్బంగా వారుమాట్లాడుతూ… 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి సెక్యూరిటీ గార్డులను వెంటనే పర్మనెంట్ చేసి, అవసరతను బట్టి వారికి సాంపిక భద్రత కల్పించాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పార్కిం లేకపోవడంతో నిషేద ప్రదేశాల్లో ప్రదేశాల్లో పార్కింగ్ చేయడానికి సేక్యూరిటీ గార్డ్స్ నిషేదించడంతో వారిపై దాడులు చేస్తున్నారని ఇలాంటి దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయన్నారు. కాకినడ ప్రభుత్వ ఆసుపత్రిలో పార్కింగ్ ప్రదేశాన్ని ఏర్పాటు చేయాలని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ని కోరారు.

