సాధారణ ఎన్నికలకు సంబంధించి వల్నరబుల్ ప్రాంతాలు, పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు సెక్టార్ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని విధాన గౌతమి సమావేశ మందిరంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు సెక్టార్ ఆఫీసర్లు, సెక్టర్ పోలీస్ ల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా. కృతికా శుక్లా, జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ తో కలిసి హాజరై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ… సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సెక్టార్ ఆఫీసర్లు, సెక్టర్ పోలీసులకు తొలి శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సుమారుగా 10 నుంచి 12 పోలింగ్ స్టేషన్లను ఒక సెక్టార్ గా ఏర్పాటుచేయడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె శ్రీధర్ రెడ్డి, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఈఆర్వోలు, సెక్టార్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
(డీఐపీఆర్వో కాకినాడ వారి జారీ)
సెక్టార్ ఆఫీసర్లు, సెక్టర్ పోలీసులకు శిక్షణా కార్యక్రమం…

