జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో కాకినాడ పార్లమెంటు స్థానానికి ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ కు, కాకినాడ సిటీ స్థానానికి ఉమ్మడి ఎమ్.ఎల్.ఏ. అభ్యర్థి గా పోటీ చేస్తున్న వనమాడి కొండ బాబు కు మద్దతుగా కాకినాడ సిటీ జగన్నాధపురం 23 వ డివిజన్ లో ఇంటింటా ప్రచారo నిర్వహించారు. ఈ ప్రచారాన్ని కాకినాడ పార్లమెంటు ఎలక్షన్ కమిటీ సభ్యులు మల్లాడి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించి, సూపర్ సిక్స్ పథకాలపై ప్రతీ ఒక్కరికి అవగాహన కల్పించారు. అలాగే తెలుగుదేశం బి.సి. డిక్లరేషన్ పై ప్రజలకు అవగాహన కల్పించారు .ఉమ్మడి మ్యానిఫెస్టో ను వివరిస్తూ… తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ను, వనమాడి కొండ బాబు లను అఖండ మెజారిటీ తో గెలిపించాలని ఓటర్ లను అభ్యర్ధిందచారు. ఈ కార్యక్రమంలో 23 వ డివిజన్ టి.డి.పి. వీరెళ్ళి ఏసు, పూర్ణ, నులుకుర్తి సాయి, కోటిపల్లి ఏసు, జోగారపు ప్రసాద్, జోగారపు వెంకట లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
సూపర్ సిక్స్ పథకాలు, బి.సి. డిక్లరేషన్ పై అవగాహన కార్యక్రమం…

