
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు, కొవ్వూరు సామాజిక ఆరోగ్య కేంద్రాలలోని ఐసీటీసీ కేంద్రాల్లో సిబ్బంది పనితీరును జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్ వసుంధర బుధవారం పరిశీలించారు. సీహెచ్సీలో అందుతున్న వైద్య సేవల పట్ల ఆరా తీశారు. అనంతరం నాన్ ఏఎన్సీ రిజిష్టర్, ఐసీటీసీ, పిఐడీ రిజిష్టర్, స్పౌజ్ టెస్టింగ్, కౌన్సిలింగ్ రిజిష్టర్ తదితర రికార్డులను పరిశీలించారు.
