ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి విశాఖ పటణం పర్యాటన సందర్బంగా ఎం.వీ.పీ. పోలీసులు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ను గృహ నిర్బంధం చేసారు. దీనిపై జనసేన శ్రేణులు మండిపడుతున్నారు. యాదవ్ మాట్లాడుతూ… సీ.ఎం. పర్యట కారణంగా తనను గృహ నిర్బంధం చేయడం సమంజసం కాదన్నారు. ఎన్నికలు సమీపిస్తుడడంతో ప్రజలను మబ్బిపెట్టడానికి ఆడుదాం ఆంధ్ర క్రీడలను నిర్వహిస్తున్నారన్నారు. ఈ క్రీడల పేరు చెప్పి 500 కోట్ల రూపాయులు పక్కదారిపట్టించారని ఆరోపించారు. క్రీడాకారులకు కనీసం మంచినీరు కూడా అందించలేకపోయారని విమర్శించారు. ప్రతీ సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని యువతను మోసం చేసారన్నారు.
సీఎం జగన్ విశాఖ పర్యటన… జనసేన నేత పీతల మూర్తి యాదవ్ గృహ నిర్బంధం…

