ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మంగళవారం రాష్ట్ర శాసనసభలో యూనిఫాం సివిల్ కోడ్ (యు.సి.సి.) బిల్లును ప్రవేశపెట్టారు. అసెంబ్లీ దానిని ఆమోదించి చట్టంగా మారిన తర్వాత, స్వాతంత్య్రానంతరం యు.సి.సి. ని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరిస్తుందని ఆయన అన్నారు. దేవభూమి ఉత్తరాఖండ్ పౌరులకు సమాన హక్కులు కల్పించే లక్ష్యంతో ఈ రోజు అసెంబ్లీలో యూనిఫాం సివిల్ కోడ్ బిల్లు ప్రవేశపెట్టబడుతుందన్నారు. ఇది ప్రజలందరికీ గర్వకారణమని చెప్పారు. యు.సి.సి. ని అమలు చేసే దిశగా దేశంలోనే మొదటి రాష్ట్రంగా మనం పేరు తెచ్చుకుంటామన్నారు.
సివిల్ కోడ్ బిల్లును ప్రవేశపెట్టిన ఉత్తరాఖండ్ సీ.ఎం. …

