తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్ లో ఉన్న ఊర్వశి బార్ లైసెన్సును రద్దుచేసారు. ఆ బార్ లో అశ్లీల నృత్యాలు చేస్తున్నారనే నిఘ వర్గాల సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దానిపై దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో 30 మంది అమ్మాయిలతో పాటు 70 మంది కస్టమర్లు కనిపించడంతో షాక్ అయ్యారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించేందుకు వీలగా యాజమాన్యం బార్లో అమ్మాయిలతో నృత్యాలను ఏర్పాడుచేసారని అధికారులు తెలిపారు. దానితో సదరు యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేసి బార్ లైసెన్స్‌ను రద్దు చేసారు. తదుపరి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.
సికింద్రాబాద్ ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ పై పోలీసు దాడులు…
