సామాజిక న్యాయం లక్ష్యంగా రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం పని చేస్తోందని డిప్యూటీ సీ.ఎం. బూడి ముత్యాల నాయుడు అన్నారు. 2024లో జగన్ అవసరం ఎంతైనా ఉందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు,ఉన్నత కులాలలో ఆర్ధికంగా వెనుక బడిన వారికి తెలియజేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా సామాజిక సాధికార బస్సు యాత్రను రాష్ట్రంలోని నిర్వహిస్తునట్లు ఆయన చెప్పారు. సామాజిక సాధికార బస్సు యాత్ర సభ కాకినాడ రూరల్లోని సర్పవరం సెంటర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్యాల నాయుడు, మంత్రులు విశ్వరూప్, వేణు మాట్లాడుతూ… కులం, మతం వంటివి చూడకుండా పథకాలు అందించడం లక్ష్యంగా రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతుందన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు వివరించి జగన్ పాలన తిరిగి అవసరమంటూ ఈ బస్సు యాత్రలో ప్రజలకు వివరిస్తున్నట్లు తెలిపారు.
సామాజిక న్యాయం వై.యస్.ఆర్. కాంగ్రెసు పార్టీ తోనే సాధ్యం…

