సామర్లకోట పట్టణంలో చంద్రమౌళి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్యాన్సర్, సాధారణ వ్యాధుల ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. స్థానిక పూర్ణ కళ్యాణ మండపంలో ఈ శిబిరాన్ని మాజీ మున్సిపల్ చైర్మన్, సీనియర్ వైద్యులు డా. చండలాడ అనంత పద్మనాభం రిబ్బను కత్తిరించి శిబిరాన్ని ప్రారంభించారు. హైదరాబాదు కు చెందిన గ్రేస్ ఫౌండేషన్ సహకారంతో ఒక్కో వాహనంలో రూ. 7 కోట్లు విలువచేసే అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన రెండు బస్సులను ఏర్పాటు వాటిద్వారా మహిళలు, పురుషులకు నేరుగా వైద్య పరీక్షలను చేస్తున్నారు.
అన్నిరకాల క్యాన్సర్ బలహీనతలను పరీక్షలు, స్కానింగ్ ల ద్వారా గుర్తించి వారికి వ్యేలాటి చికిత్సలు అవసరమో రోగులకు అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. కేవలం క్యాన్సర్ వ్యాధికి మాత్రమే గాక సాధారణ వ్యాధులు, ఎముకుల వ్యాధులు, గర్భకోస వ్యాధులకు సంభందించి ఉచిత వైద్య పరీక్షలు నీ వహించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన మొదటి రోజు శిబిరంలో వందల మంది ప్రజలు పాల్గొని వైద్య సేవలను పొందారు. ఈ వైద్య సేవలు రెండురోజులు పాటు కొనసాగుతాయని తెలిపారు.

