రాష్ట్ర ఫుడ్ కమిటీ సభ్యుడు జక్కంపూడి కిరణ్ సామర్లకోటలో విస్తృత తనిఖీలు చేపట్టారు. గత రెండు రోజులుగా కాకినాడ జిల్లాలో వచ్చిన పలు ఫిర్యాదుల ఆధారంగా ఆయన ఈ తనిఖీలు చేపట్టారు. సామర్లకోటకు విచ్చేసిన ఫుడ్ కమిటీ సభ్యులు సాయి నగర్ లోనూ, సంపంగి తోట ప్రాంతాల్లో రేషన్ షాపులను తనిఖీ చేశారు. సాయి నగర్ లో రేషన్ డీలర్ యజమాని ప్రజల నుంచి బయోమెట్రిక్ తీసుకుని సరుకులు సకాలంలో అందించడం లేదని వచ్చిన ఫిర్యాదులపై చైర్మన్ ఆరా తీశారు. రెండు రేషన్ డిపోలలో సరుకులను రికార్డులను పరిశీలించి రికార్డు పరంగా సరుకులు స్టాక్ ఉన్నది లేనిది పరిశీలించారు అలాగే పలువురు ప్రజల నుండి వివరాలను సేకరించారు.
సామర్లకోటలో ఫుడ్ కమిటీ సభ్యులు విస్తృత తనిఖీలు…

