Exclusive

సామర్లకోటలో పోస్టు కార్డులతో అంగన్వాడీలు ధర్నా…

1243299-ankan

తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ అంగన్వాడీలు చేస్తున్న 17వ రోజు నమ్మెలో భాగంగా సామర్లకోట తహసిల్దార్ కార్యాలయం ఎదుట అర్బన్, రూరల్ సెక్టార్ల పరిధిలో అంగన్వాడీలు పోస్టల్ కార్డులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. యూనియన్ నాయకురాలు టి. నాగమణి అధ్వర్యంలో నిరసన కొనసాగించారు. తొలుత సీ.ఐ.టి.యు. కార్యాలయం నుండి పోస్టు కార్డులు చేతపట్టి నిరసన వ్యక్తం చేస్తూ సామర్లకోట పెద్ద పోస్టాపీస్ వద్ద 350 మంది అంగన్వాడీలు తరలి వెళ్ళి ముఖ్యమంత్రికి రాసిన పోస్టు కార్డులను పోస్టు బాక్సులో వేశారు.

ఆందోళన అనంతరం సామర్లకోట మండల తహసిల్దార్ లక్ష్మీ నరసకుమారికి వినతి పత్రం అందచేశారు. తమ సమస్యలపై సీఎం జగన్ తక్షణమే స్పందించాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, సుప్రీం తీర్పు ప్రకారం గ్రాట్యూటీ ఇవ్వాలని అన్నారు. ఈ సమ్మెలో నాయకులు వి. అమలావతి, అంగన్వాడి కార్యకర్తలు, హెల్బెర్లు సుమారు 400 మంది పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.