సామర్లకోట పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక మఠం సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం ఎదుట సైకో పోవాలి అంటూ… రాసిన కరపత్రాలను దహనం చేసి వైసీపీ కి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. పార్టీ అధిష్టానం అందించిన ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సామర్లకోటలో టీడీపీ నిరసనలు వెల్లువ…

