రాష్ట్రంలో తమ న్యాయమయిన డిమెండ్ల కోసం పోరాటం చేస్తున్న మున్సిపల్, అంగన్వాడి, సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులను ప్రభుత్వం గుర్తించి వారి సమస్యలను వెంటనే పరిష్కారించాలని కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కాంట్రాక్ట్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ (సి.ఐ.టి.యు.) ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు సి.హెచ్. విజయ్ కుమార్ మాట్లాడుతూ… కోవిడ్ సమయంలో మున్సిపల్ కార్మికులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలందరాని గుర్తుచేశారు.
కాని వారి సేవలను గుర్తించి ఒక్క నెల జీతం కూడా అదనంగా చెల్లించలేదన్నారు మండిపడ్డారు. తమకు అండగా నిలిచిన మున్సివల్ వర్కర్లకు సంఘీభావం తెలియచేస్తున్నామని అన్నారు. ఇప్పటికయినా… ఈ ప్రభుత్వం స్పందించి మున్సిపల్ కార్మికుల డిమాండ్స్ పరిష్కారించాలన్నారు. ఈ కార్యక్రమంలో సి.ఐ.టి.యు. జిల్లా కోశాధికారి మలక వెంకట రమణ, యూనియన్ నాయకులు శేషు, తదితరులు పాల్గొన్నారు.
