రాష్ట్ర జే.ఏ.సీ. పిలుపుమేరకు సమగ్ర శిక్ష అభియాన్ కాంటాక్ట్ సిబ్బంది సమ్మెలోకి వెళుతున్నట్లు సామర్లకోటకు సంబంధించిన సమగ్ర శిక్ష ఉద్యోగులు మండల విద్యాశాఖ అధికారి వై. శివ రామ కృష్ణయ్యకు సమ్మె నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా సామర్లకోట జేఏసీ నాయకులు ఎం. సుబ్రహ్మణ్యం, ఏ వీర్రాజు, శ్రీనివాసరావు, తదితరులు మాట్లాడుతూ… ఆంధ్ర రాష్ట్రంలో విద్యాశాఖలోని సమగ్ర శిక్ష అభియాన్ పథకంలో 25 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారన్నారు.
జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ సమ్మెలోకి వెళుతున్నట్లు చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఎం.టి.ఎస్. అమలు చేయాలని, తదితర న్యాయమైన కోర్కెలు కొరకు సమ్మెలోకి వెళుతున్నట్లు చెప్పారు.
