గోదావరి డెల్టా సిస్టం పరిధిలో గల పంట కాలువలకు రబీ సీజన్ 2023-24 కు సంబంధించి పంటల సాగుకు సాగునీటి సరఫరా నిరంతరంగా జరుగుతుందని గోదావరి డెల్టా సిస్టం ధవలేశ్వరం చీఫ్ ఇంజనీర్ సతీష్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు ప్రధాన కాలువలు గోదావరి తూర్పు, మధ్యమ, పశ్చిమ డెల్టా ప్రధాన కాలువల పరిధిలో ఉన్న వరిపంట, త్రాగునీటి అవసరాలు చివరి స్థాయికి చేరుకున్నందున పంట కాలువల్లో నీటిని 10.05.2024 శుక్రవారం సాయంత్రం 6.00 గంటలకు నిలుపుదల చేయుటకు నిర్ణయించారని ఆయన తెలిపారు. ఈ వారం రోజులలో కాలువల పరివాహ ప్రాంతాలలో ఉన్న గ్రామాలకు చెందిన వారు కాలువలు మూసి వేస్తున్న దృష్ట్యా వేసవి రక్షిత సమ్మర్ స్టోరేజ్ చెరువులను పూర్తిస్థా యిలో నింపుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
సమ్మర్ స్టోరేజ్ చెరువులను పూర్తిస్థా యిలో నింపుకోవాలి…

