పవరలో నిర్మించిన ట్రినిటీ మల్టీస్పెషాలిటి ఆసుపత్రి మొదటి వార్షిక వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కౌశిక్ మాట్లాడుతూ… ఈ ఏడాది చివరిలోగా ట్రినిటీ ఆసుపత్రిలో అంతర్జాతీయ స్థాయిలో వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నమని తెలిపారు. ఆసుపత్రి ప్రారంభమైన ఏడాదిలోనే 1200 మంది ఇన్ పేషెంట్లు, 8వేల మంది ఔట్ పేషెంట్లకు వైద్య సేవలు అందించామన్నారు.
అందులో 800 సర్జరీలకు గాను సుమారు 300 సర్జరీలు ఆరోగ్యశ్రీలోనే నిర్వహించామని వెల్లడించారు. మహిళలకు సర్వేకల్, బ్రెస్ట్ క్యాన్సర్కు ఉచితంగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తునామని తెలిపారు. గడచిన ఈ ఏడాదిలో ఆసుపత్రిలో మరణాల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉన్నాయని అందుకు మా ఆసుపత్రి సిబ్బంది అందిస్తున్న సేవలే కారణమని వారి సేవలను కొనియాడారు.

