సంక్రాంతి కావస్తున్నా ఏ.పీ. శాక్స్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇంకా వేతనాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పద్నాలుగవ తేదీ వచ్చినా వేతనాలు వేయలేదని వేతనాలకోసం 1100 మందికి పైగా ఏ.పీ శాక్స్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఎదురుచూపులు ప్రభుత్వానికి కనిపించడంలేదని ఆందోళన చేస్తున్నారు. అంతేకాకుంగా ఆకస్మాతుగా ముఖ ఆధారిత(ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ ) హాజరు పేరుతో ఉద్యోగులకు వేతనాలు నిలిపేసారుని మండిపడ్డారు.
ప్రతినెలా ప్రతీ జిల్లా నుంచి 25వ తేదీకే హెడ్ ఆఫీస్ కి ఉద్యోగుల హాజరు చేరుతుందని… నేడు కావాలనే తీవ్ర జాప్యం చేసారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి వంద శాతం నిధులు విడుదల చేసినప్పటికీ ఉద్యోగులు పండుగ పూట పస్తులు ఉండే పరిస్థితి కనిపిస్తుందన్నారు. నిధులకు కొదవ లేదని కానీ శాక్స్ ఉన్నతాధికారుల వైఖరితో ఏ.పీ శాక్స్ కాంట్రాక్ట్ ఉద్యోగులు పండుగ పూట కూడా పస్తున ఉండవలసిన పరిస్థితి వచ్చిందన్నారు.
సంక్రాంతికి కూడా శాక్స్ ఉద్యోగులకు పస్తులే..!
