Kakinada

షోకాజ్ నోటీసులు ధగ్నం చేసిన సమగ్రశిక్షా ఉద్యోగులు…

WhatsApp Image 2023-12-29 at 4.16.53 PM

తమ న్యాయమయిన డిమెండ్ లను నెరవేర్చమని గత 10 రోజులుగా సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఏ.పీ. ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం ద్వారా, మెమోలు పంపడం ద్వారా ఉద్యమాన్ని ఆపలేరని, అధికారులు ఇచ్చిన నోటీసులను కాకినాడలో ధర్నాచౌక్ దగ్గర అంబేద్కర్ విగ్రహం వద్ద ధగ్నంచేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా బెదిరింపులతో ఉద్యమాన్ని ఆపలేరంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు యు.టి.ఎ.ఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రవర్తి, సామర్లకోట యూ.టీ.ఎఫ్. అధ్యక్షురాలు ఎం.బి.ఎం. బి.బి. నాంచారిదేవి, తదితరులు మద్దతు తెలిపారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… రాష్ట్రంలో ఏ చిన్న ఉద్యమం జరిగినా సమస్యలు పరిష్కరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమాల అణిచివేతకే ప్రాధాన్యతని ఇస్తుందని అందులో భాగంగానే సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు నోటీసులు పంపి విభజించు పాలించు అనే బ్రిటిష్ సూత్రాన్ని అనుసరిస్తుందని విమర్శించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-20 at 4.43.33 PM
Kakinada

బాల్యవివాహాలను సమూలంగా నిర్మూలిద్దాం… నగరపాలక సంస్థ కమిషనర్ నాగ నరసింహారావు వెల్లడి…

బాల్య వివాహాల నిషేధిత చట్టం – 2006 ను మరింత పటిష్టవంతంగా అమలు చేయడంలో ఆయా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ