శ్రీనగర్‌లోని గండ్‌బాల్ ప్రాంతంలోని జీలం నదిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నదిలో పడవ బోల్తా పడడంతో పడవలో ఉన్నవారిలో 10 మంది పైగా గల్లంతయ్యారు. విషయం తేలుసుకున్న రెస్క్యూ టీమ్ ఘటన స్థలానికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జీలం సహా పలు నీటి వనరుల నీటి మట్టాలు పెరిగాయి.
భారీ వర్షాల కారణంగా సోమవారం వేసవి రాజధానిలో ప్రధాన రహదారులపై నీటి పారుదల వ్యవస్థ నిలిచిపోయిందని గ్రేటర్ కాశ్మీర్‌లోని ఒక నివేదిక తెలిపింది. పెద్దఎత్తున గుంతలు పడి తవ్విన రోడ్లు వర్షపు నీటితో నిండిపోవడంతో నగరంలో ప్రయాణించడం కష్టంగా మారిందని ప్రయాణికులు వాపోతున్నారు. భారీ గుంతలు, తవ్విన రోడ్ల గుండా వెళ్ళిన తరువాత చాలా మంది ప్రయాణికులు తృటిలో తప్పించుకున్నారని నివేదిక పేర్కొంది.

