కాకినాడ మెడికల్ హోల్ సేల్ అండ్ రిటైల్ షాప్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యం లో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేవాలయంవీధి లో యూనియన్ స్థూపం వద్ద జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ ప్రముఖ సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు పాల్గొని ఎర్ర జెండా ఎగురవేశారు. సంఘం అధ్యక్షులు కోలాఎల్లారావు ప్రధానకార్యదర్శి పెద్ధింశెట్టి వీర వెంకటసత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకల్లో సంఘ ప్రతినిధులు పెదిరెడ్డి సత్యనారాయణ, వడ్డాది వెంకటసత్యరమణరావు, పోలవరపు అప్పల రాజు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రమణరాజు మాట్లాడుతూ… శ్రామిక వర్గం లేకుండా ప్రపంచ గమనం సమాజ ప్రగతి సాధ్యం కాదన్నారు. బి.ఆర్. అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటే కార్మిక చట్టాలు పటిష్టమవుతాయన్నారు. మే 13న ప్రతి కార్మికుడు సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నచ్చ కుంటే ఇ వి ఎం మెషిన్ లో ఆఖరి బటన్ గా వుండే నోటా కు ఓటు వేయాలని సూచించారు.

