బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వై.సీ.పీ. కి వాసంశెట్టి సుభాష్ రాజీనామాచేస్తన్నట్లు మరియు పార్టీ మార్పుపై త్వరలో నిర్ణయం తీసుకుంటున్నట్లు పాత్రికేయుల సమావేశంలో తన నిర్ణయాన్ని వెల్లడించారు. స్థానిక నాయకత్వం తనని తన కుటుంబాన్ని తమ కార్యకర్తలని ఎంతో ఇబ్బందికి గురి చేసిందని ఇంతకాలం ఎంతో ఓపికతో సహించామని తెలిపారు. కోనసీమ అల్లరిలో కూడా అన్ని కులాల వాళ్ళు ఎంతో ఇబ్బందులకు గురయ్యారనిఅన్నారు.
అప్పటి ఎస్.పి. సుధీర్ కుమార్ రెడ్డి కలవడం జరిగిందని ఆయన సానుకూలంగా స్పందించి నిర్దోషులను కేసులు లేకుండా చేయడం జరిగిందన్నారు. ఆ తర్వాత మిథున్ రెడ్డి చొరవతో కేసులను ఎత్తివేయడం జరిగిందని గొడవలు కారణమైన వ్యక్తికి ఎమ్మెల్యే సీటు ఇచ్చారన్నారు. ఆయన నెగ్గించుకుంటే మరో ఐదుసంవత్సరాలు బాధలు పడడానికి సిద్ధంగా లేమని అందుకనే తాము తమ కార్యకర్తలతో కలిసి వై.సీ.పీ. కి రాజీనామా చేస్తున్నామని అన్నారు.

