కాకినాడ జిల్లాలో వై.ఎస్.ఆర్.సీ.పీ. కి భారీ షాక్ తగిలింది. సామర్లకోట మండలానికి చెందిన పీ. వేమవరం గ్రామంలో వై.సీ.పీ. కి చేందిన 100 మంది నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి స్వచ్చందంగా చేరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే తనయుడు నిమ్మకాయల రంగనాగ్, మూసిరెడ్డి శ్రీరాములు, మూసిరెడ్డి రాంబాబుల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా వారందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్నా, రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా చంద్రబాబుని గెలిపించి ముఖ్య మంత్రిని చేయాలని అన్నారు. అందుకు అందురూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీ.డీ.పీ., జనసేన, బీ.జే.పీ. నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
వై.సీ.పీ. భారీ షాక్ ఇచ్చిన కార్యకర్తలు…

