వై.సీ.పీ. ప్రభుత్వ పాలనలో విద్యుత్ రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని ఎన్డీయే కూటమి పార్టీల నేతలు స్పష్టం చేశారు. శనివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహిచారు. ఈ సందర్బంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి. విజయ్ కుమార్ మాట్లాడుతూ… వై.సీ.పీ. విద్యుత్ కుంభకోణంతో కోట్లకు పడగలెత్తారన్నారు. వై.సీ.పీ. ప్రభుత్వ అసమర్థ పాలనలో జరిగిన భారీ విద్యుత్ కుంభకోణంలో బడా నేతలు కమీషన్ల రూపంలో కోట్లాది రూపాయలు దండుకొని భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. సౌర విద్యుత్ కొనుగోలులో వందలాది కోట్ల రూపాయలు చేతులు మారాయని, ట్రూ అప్, ఫిక్సిడ్, అదనపు చార్జీల పేరిట తొమ్మిదిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచారని అన్నారు. ఈ సమావేశంలో టీ.డీ.పీ. జాతీయ అధికార ప్రతినిధి జి.వి. రెడ్డి, బీ.జే.పీ. మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ పాల్గొన్నారు.
వై.సీ.పీ. పాలనలో సంక్షోభంలో విద్యుత్ రంగం… -డాక్టర్ పి. విజయ్ కుమార్-

