తిరుపతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా APCC చీఫ్ వై.ఎస్. షర్మిలా రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… ఒకప్పుడు వై.సీ.పీ. నీ నా బుజాన్న వేసుకొని పాదయాత్ర చేశానన్నారు. వై.సీ.పీ. లో పాదయాత్ర చేసి నిలబెట్టా, అండగా నిలబడ్డా… అధికారంలో తెచ్చా ఈ రోజు కనీసం కృతజ్ఞత కూడా లేకుండ పోయిందన్నారు. నా మీద, నా వ్యక్తిగత జీవితం మీద, నా పేరు మీద నానా రకాలుగా దాడులు చేస్తున్నారన్నారు. అయినా వైఎస్సార్ బిడ్డ ఇటుంటివాటికి భయపడేది కాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు పల్లం రాజు, రఘువీరా రెడ్డి, కొప్పుల రాజు, గిడుగు రుద్రరాజు, ఇతర నేతలు పాల్గొన్నారు.
వై.సీ.పీ. నీ నా బుజాన్న వేసుకొని పాదయాత్ర చేసాను… -వై.ఎస్. షర్మిళా-

