Political

వై.సీ.పీ. కౌన్సిలర్ పిల్లాడి తెదేపా లో చేరిక…

WhatsApp Image 2024-04-05 at 5.31.20 PM

సామర్లకోట 8వ వార్డు కౌన్సిలర్ పిల్లాడి సత్యవతి వై.సీ.పీ. నుంచి రెండు దఫాలుగా కౌన్సిలర్ గా పోటీ చేసిన పాలచర్ల కళ్యాణ్ కుమార్ లు శుక్రవారం సాయంత్రం తెదేపా లో చేరారు. తెదేపా కార్యాలయంలో సామర్లకోట పట్టణ అధ్యక్షులు అడబాల కుమార స్వామి, కౌన్సిలర్ బలుసు వాసుల ఆధ్వర్యంలో వీరిని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ప్రస్తుతం వై.సీ.పీ. కౌన్సిలర్ గా కొనసాగుతున్న సత్యవతి గత ఎన్నికల ముందు తెదేపా నుంచి వై.సీ.పీ. లో చేరి తదుపరి జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 8వ వార్డు నుంచి కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు. అలాగే కళ్యాణ్ కుమార్ గతంలో రెండుసార్లు వై.సీ.పీ. కౌన్సిలర్ అభ్యర్దిగా పోటీచేసి పరాజయం పొందారు. ఈ కార్యక్రమంలో నాయకులు బడుగు శ్రీకాంత్, నియోజక వర్గ పరిధిలోని పలువురు తెదేపా నాయకులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.