Political

వై.యస్. షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వవైభవం…

OIP (5)

ఆంద్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వై.ఎస్. షర్మిల అధికారం చేపట్టినప్పటినుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం కుంజుకొస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మత్స్యకారుల విభాగం ఉపాధ్యక్షులు ఎల్పీ రాజు, పీ.సీ.సీ. సభ్యులు కుక్కల పోతురాజు, కార్మిక సంఘాల నాయకుడు తాళ్ళారు రాజు పేర్కొన్నారు. 138 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో అపార అనుభవం, న్యాయకత్వం పటిమ గల ఏ.పీ. పీ.సీ.సీ. అధ్యక్షురాలు వై.యస్. షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్రంలో పూర్వవైభవం రావడం తధ్యమని అన్నారు.

శనివారం కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఫకీర్ రాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు చేరారు. వారికి ముఖ్య అతిథులు పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రధానమంత్రిగా రాహుల్ బాధ్యతలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సత్తిబాబు, తుమ్మలపల్లి చిన్న, ఖమ్మం రాజబాబు, చిక్కల రెడ్డి నాయుడు, తదితరులు ఉన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.