నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీ పార్టీ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా సీ.ఎం. జగన్ సమక్షంలో అమలాపురం నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకులు భారీ సంఖ్యలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నెల్లూరు జిల్లా ఆర్.ఎస్.ఆర్. ఇంటర్నేషనల్ స్కూల్లో సీ.ఎం. జగన్ భోజన విరామ సమయంలో జనసేన నేతలను పార్టీ కండువాలతో కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన అమలాపురం నియోజకవర్గ ఇన్-చార్జ్ శేట్టిబత్తుల రాజబాబు, తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. శ్రీనుబాబు, ఎస్సీ డివిజన్ రాష్ట్ర నాయకుడు ఎం. శ్రీనివాస్, మాజీ ఎం.పీ.టీ.సీ. సి.హెచ్. వెంకటేశ్వరరావు, జనసేన వీరమహిళా నాయకురాలు చెట్టి సుబాషిణి, తదితరులు కొద్ది రోజుల ముందు లాంఛనంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వై.ఎస్.ఆర్.సీ.పీ. లో చేరిన శెట్టిబత్తుల రాజబాబు…

