అంగన్ వాడీలు తమ న్యాయమయిన సమస్యలను నెరవేర్చమని గత 15 రోజులుగా సమ్మె చేస్తున్నారు. అయిన ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని అంగన్వాడీ యూనియన్ నేతలు మండిపడ్డారు. మంత్రి బొత్స సత్యనారాయణ, అధికారుల బృందంతో చర్చలు విఫలం అయ్యాయన్నారు. ‘ఇప్పటి వరకు నాలుగు సార్లు చర్చలు జరిపారు కానీ మా డిమాండ్స్ పై సానుకూలంగా స్పందించడంతో రాష్ట్రంలో అధికార వై.సి.పి.కి. చెందిన ఎమ్మెల్యేలు, ఇన్చార్జిల ఇంటివద్ద నిరసనకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా పెద్దాపురం నియోజవర్గం వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ దొరబాబు ఇంటిని ముట్టడించి తమ నిరసన వ్యక్తం చేసారు..
వై.ఎస్.ఆర్.సీ.పీ. ఇంచార్జ్ ఇంటి వద్ద అంగన్వాడీలు నిరసన…

