Political

వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన విశ్వరూప్…

WhatsApp Image 2024-04-22 at 4.36.09 PM

అంబెడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, రాష్ట్ర రవాణాశాఖమంత్రి పినిపే విశ్వరూప్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం భట్నవిల్లిలోని తన స్వగృహం నుండి పార్టీ శ్రేణులు చేపట్టిన భారీ ర్యాలీ నడుమ కుటుంబ సభ్యులతో అమలాపురం ఆర్డీవో కార్యాలయం వద్దకు చేరుకున్న 12 గంటల 8 నిముషాలకు 2 సెట్ల నామినేషన్ పత్రాలను ఆర్.ఓ. కు సమర్పించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తనకోసం ఎండను సైతం లెక్కచేయకుండా తరలివచ్చిన వేలాది మంది అభిమానులకు, కార్యకర్తలకు, నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. గత 25 రోజులుగా నియోజకవర్గంలో గడపగడపకు కార్యక్రమంలో పాల్గొంటున్నాన ని జగన్ పాలన పట్ల ప్రజల్లో అద్భుతమైన స్పందన కనిపిస్తుందని అన్నారు. అమలాపురం సీటు వై.సీ.పీ. ఖాతాలోకి రానుందని అమలాపురంలో తాను మూడోసారి విజయం సాధించబోతున్నానని విశ్వరూప్ పేర్కొన్నారు

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.