వై.సీ.పీ. పార్టీకి మరోక బిగ్ షాక్ ఎదురయ్యింది. ప్రకాశం జిల్లాలోని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీ.డీ.పీ. లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. రెండ్రోజుల్లో ఆయన టీ.డీ.పీ. లో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే అక్కడ ఇన్ఛార్జ్ తిరుపతి యాదవ్ ను వై.సీ.పీ. నియమించినట్లు తెలుస్తోంది. ఆలూరు ఎమ్మెల్యే జయరాం సైతం వై.సీ.పీ. అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న రాప్తాడులో సీ.ఎం. సభకు ఆయన రాకపోవడంతో పార్టీ శ్రేణుల్లో ఊహాగానాలు పెరిగాయి. ఆలూరు ఇన్ఛార్జ్ గా వేరే వ్యక్తిని వై.సీ.పీ. నియమించింది. దీంతో ఆయన పార్టీ మారుతారనే ప్రచారం సాగుతోంది.
వైసీపీకి బిగ్ షాక్…!!!

