Exclusive

వైయస్సార్ ప్రభుత్వంలో రోడ్డును పడ్డ కార్మికులు… -బి.జె.పి.-

WhatsApp Image 2024-02-22 at 3.37.23 PM

ఆంధ్ర రాష్ట్రంలో వైయస్సార్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి నిర్మాణరంగం కుదిలైందని నిర్మాణరంగ కార్మికులు రోడ్డున పడ్డారని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఆరోపించింది. కాకినాడలో ప్రారంభమయిన ప్రజా పోరు యాత్ర రథం రెండవ రోజుకు చేరుకుంది. ఇందులో
భాగంగా స్థానిక కొండయ్య పాలెం, శారదా దేవి గుడి, రేచర్ల పేట రైతు బజార్ పర్యటించారు.

ఈ సందర్భంగా స్థానిక శారదా దేవి గుడి వద్ద ఉన్న వందలాదిమంది భవన నిర్మాణ కార్మికులను ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ నగర కన్వీనర్ గట్టి సత్యనారాయణ మాట్లాడుతూ… ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఒక ట్రాక్టర్ ఇసుక ధర 3500 నుంచి 4000 రూపాయలు ఉండేదని 2019 వ సంవత్సరంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ట్రాక్టర్ ఇసుక ధర 6000 నుంచి 6500 అమ్ముతోందని అన్నారు.

దాని ఫలితంగా సొంతిల్లు నిర్మించుకోవాలని అనుకునే మధ్య తరగతి ప్రజలు వారి ఆకాంక్షను, కళలను వాయిదా వేసుకుంటున్నారని ఫలితంగా భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డును పడ్డారని తీవ్రంగా దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న, ఏడిద కృష్ణ, చెక్క రమేష్, ర్యాలీ నాగేశ్వరరావు, పుణ్యపు రంగనాథ్, తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.