ఈనెల 21 గురువారం కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రి ఆర్థోపెడిక్ ఓపి విభాగంలో పూర్ ఇండియా ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో క్లబ్ ఫుట్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుందని దానిని కాకినాడ సిటీ కాకినాడ పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ జి.జి.హెచ్. సూపర్ ఇండియన్డెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… పుట్టుకతోనే వంకర పాదాల మూలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్నారులకు ఈ స్క్రీనింగ్ టెస్టులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు.
