ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో వినోద్ చౌహాన్, ఆశిష్ మాథుర్లపై దాఖలైన అనుబంధ ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోవడంపై ఢిల్లీ కోర్టు గురువారం తన ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా న్యాయస్థానం జూలై 9న కాగ్నిజెన్స్‌పై ఉత్తర్వును ప్రకటించే అవకాశం ఉందని సంభందిత వర్గాలు తెలిపాయి. ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీపై దాఖలు చేసిన ఏడవ అనుబంధ ఛార్జిషీట్‌పై కూడా కోర్టు అదే తేదీన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈడీ తరఫున హాజరైన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్.కే. మట్టా వాదనలు విన్న తర్వాత కోర్టు ఉత్తర్వులను రిజర్వ్ చేసింది.
వీరిద్దరిపై చార్జిషీట్ పై తీర్పును రిజర్వ్ చేసిన ఢిల్లీ కోర్ట్…!!!

