Viral

విహార యాత్రలో ముగ్గురు విద్యార్థులు మృతి

WhatsApp Image 2024-02-11 at 7.44.06 PM

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం ఐ పోలవరం గ్రామ సమీపంలోని సీతపల్లి వాగులో విహారయాత్రకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. వాగులో స్నానానికి దిగిన ఐదుగురులో ఈ ముగ్గురు వాగు నుంచి బయటకు రాలేకపోయారు. గోకవరం మండలం రంప ఎర్రం పాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో పదవ తరగతి చదువుతున్న కాకర వీరవెంకట అర్జున్‌, అండిబోయిన దేవి చరణ్‌, లావేటి రామన్‌ మృతి చెందారు.

సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని విద్యార్థుల కోసం గాలించి చివరికి దేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎదిగొచ్చిన కుమారులను కోల్పోయిన ఆ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.