రాష్ట్రవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలు ప్రక్షాళన చేయాలని, ఓఎస్డీలను నియమించాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ అన్నారు. టి.డీ.పీ. రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన విశాఖవాసి గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచినందుకు హేయంత కుమార్ దుస్సాల్వ కప్పి, పుష్పగుచ్చమిచ్చి, పూలమాలవేసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… గెలిచిన వెంటనే కూటమి పెద్దలు డిఎస్సీ ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలు ప్రక్షాళన చేసి, అధికారిక ఓఎస్డీలను నియమించి విశ్వవిద్యాలయాలలో బోధన బోధనీతర సిబ్బందిని, బ్యాక్లాగ్ ఉద్యోగాలను తక్షణమే భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు.

