జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యాటన షెడ్యూల్ కరారయ్యింది. ఆదివారం మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ విశాఖ పర్యాటన చేయనున్నట్లు తెలిపారు. నేటి నుంచి మూడు రోజులు పాటు విశాఖలోనే ఉండనున్నట్లు వెళ్లడి. అందులో భాగంగా విశాఖ కేంద్రంగా నాయకులతో భేటీ కానున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లా నాయకులతో భేటీలు, సమీక్షలు చేయనున్నారు. దాని తరువాత విశాఖ నుండి నేరుగా ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 21వ తేదీన పోత్తుపై కీలక ప్రకటనను విడుదల చేస్తారని తెలిపారు. ఆ తరువాత ఆయన రాయలసీమ ప్రర్యాటన చేయనున్నారు. తిరుపతిలో రాయలసీమకి సంబంధించిన నాయకులతో భేటీలు, సమీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల చివరి నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం మొదలు కానుందని తెలిపారు.
విశాఖ కేంద్రంగా నాయకులతో కళ్యాణ్ భేటీ…

