Viral

వివాదస్పదంగా మారిన అజిత్ పవార్ వ్యాఖ్యలు…

Ajit-Pawar

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ద్రౌపది ఐదుగురితో వివాహం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలు మహాయుతి అభ్యర్థికి ఓటు వేస్తేనే ఇంద్రాపూర్‌కు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. మహాయుతి కూటమిలో బి.జె.పి., ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వర్గం ఉన్నాయి. బారామతిలోని ఇందాపూర్‌లో జరిగిన సభలో పవార్ మాట్లాడుతూ… కొన్ని జిల్లాల్లో లింగ నిష్పత్తిలో చాలా తేడా ఉందని, వెయ్యి మంది అబ్బాయిలకు కేవలం 850 మంది ఆడపిల్లలే ఉన్నారని మరియు కొన్ని చోట్ల 790 మంది ఆడపిల్లలే ఉన్నారన్నారు.

రానున్న రోజుల్లో ద్రౌపది గురించి ఆలోచించాలని అనిపిస్తోందని ఆ జోక్‌ని మరచిపోండి లేదంటే రేపు ద్రౌపదిని అవమానించినందుకు నన్ను విమర్శించాల్సి వస్తుందని మరాఠీలో అన్నారు. అజిత్ పవార్ వ్యాఖ్యలపై నిప్పులు చెరిగిన శరద్ పవార్ వర్గానికి చెందిన ఎన్‌.సి.పి. నాయకుడు జితేంద్ర అవద్, లింగ నిష్పత్తిలో ముంచుకొచ్చే అంశాన్ని హైలైట్ చేయడానికి అజిత్ పవార్ ఇతర ఉదాహరణలను అందించవచ్చని అన్నారు. ఇలాంటి ప్రకటనల వల్లే శరద్ పవార్ గతంలో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.