Education / Career

విధ్యార్దులను ఇంటర్న్ షిప్ కోసం పంపించాలి.. -జిల్లా కలెక్టర్ డా. కృతికాశుక్లా-

WhatsApp Image 2023-12-08 at 6.35.26 PM

జిల్లాలో చదువుతున్న ఇంజనీరింగ్, డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఇంటర్న్ షిప్ పూర్తి చేసేందుకు సంబంధిత ప్రభుత్వ శాఖలకు , ప్రైవేట్ సంస్థలకు విద్యార్థులను కేటాయించాలని జిల్లా కలెక్టర్ డా. కృతికాశుక్లా అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని కోర్టు హాలులో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం పై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జనవరి 2024 నుండి జూన్2024 వరకు ఆరు మాసాలు శిక్షణ పూర్తి చేసేందుకు వారి విద్యకు సంబంధించిన ప్రభుత్వ శాఖలకు, ప్రైవేట్ సంస్థలకు విద్యార్థులను కేటాయించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఏ ఏ కళాశాల విద్యార్థిని ఏ శాఖకు, ఏ సంస్థకు కేటాయించారో వాటి వివరాలను పూర్తి స్థాయిలో అందజేయాలని కలెక్టర్ సూచించారు. వారు ఇంటర్న్ షిప్ చేసే సమయంలో అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో వికాస్ పీడీ కే. లచ్చారావ్, స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఆదిశేషు, తదితరులు పాల్గొన్నారు.

 

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-12 at 5.50.59 PM
Education / Career

ఆదిత్య కు అవార్డులు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ విభాగం ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన రసస్వాద ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో నాక్ ‘ఏ ప్లస్ ప్లస్’ గుర్తింపుపొందిన తమ
sch
Education / Career

14 నుంచి పాఠశాలలకు దసరా సెలవులు…

జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఈనెల 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించినట్టు మండల విద్యాశాఖాధికారి వై శివరామ కృష్ణయ్య తెలిపారు. ఆయన