సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా శంఖవరం మండలంలోని పెద్దమల్లాపురం గ్రామంలో ఉన్న ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఎగ్జామ్ పాడ్స్ పంపిణీ చేయడం జరిగింది. బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో కలిసి పాడ్స్ ను విద్యార్థులకు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ… పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులకు సహాయకారిగా ఉండాలని పాడ్స్ అందజేసినట్లు వివరించారు. తమకు తగిన వేదిక కల్పించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఇతర సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. సానా సతీష్ బాబు ఫౌండేషన్ చొరవ పట్ల విద్యార్థులు మరియు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
విద్యార్థులకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఎగ్జామ్ పాడ్స్ పంపిణీ…

