కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సి.ఎస్.ఆర్. కింద జిల్లాలోని ఎస్సీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో నివసిస్తూ విద్యను అభ్యసించుచున్న 7,000 మంది విద్యార్థిని, విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశం హల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వారు సి.ఎస్.ఆర్. ఫండ్ కింద రూ. 10 లక్షలు అంచనా వ్యయంతో విద్యార్థినీ, విద్యార్థుల సౌకర్యార్థం సమకూర్చిన 1,020 పరుపులను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ… కార్పొరేట్ కంపెనీలు వారి అవసరాలు పనులు నిమిత్తం జిల్లా కలెక్టర్ వారి కలిసిన సందర్భంలో సి.ఎస్.ఆర్. నిధుల కింద కోనసీమ జిల్లాలోని విద్యార్థినీ, విద్యార్థులకు కనీస వసతులు కల్పించాలని సూచించడం జరిగిందన్నారు. ఆ మేరకు కంపెనీలు సి.ఎస్.ఆర్. కింద సంక్షేమ వసతి గృహాలకు వసతులు కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సి.పి.ఓ. వెంకటేశ్వర్లు, బీ.సీ. వెల్ఫేర్ అధికారి వై. సాంబమూర్తి, వసతి గృహ సంక్షేమ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

