దివంగత కాకినాడ మాజీ మున్సిపల్ చైర్మన్ జ్యోతుల సీతారామ మూర్తి అంత్యక్రియలను సోమవారం ఉదయం 11.30నిమిషాలకు స్థానిక విజ్జపురెడ్డి హిందూ స్మశాన వాటిక లో నిర్వహించారు. ఈ అంత్యక్రియలకు నలుగురు కుమారులు, బంధువులు మరియు తరలి వచ్చిన పలు రాజకీయ పార్టీల ప్రజాసంఘాల నగర ప్రముఖులు పార్థీవ దేహాన్ని స్మశాన వాటిక వరకు మోసుకొని తీసుకొనివెళ్లారు. పెద్ద కుమారుడు ప్రజ్వలన కర్మలు నిర్వహించారు. ఈ అత్యక్రియల్లో తంగెళ్ళ ఉదయ కుమార్, పోతుల విశ్వం, నల్లమిల్లి శేషారెడ్డి, టిక్కు సుంకర పావని, మోర్తా రాజశేఖర్, బేబీరాణి, దువ్వా శేషబాబ్జీ, చింతపల్లి అజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. అంతిమ నివాళులర్పిం చారు. ఏప్రిల్ 17 న దశ దిన కర్మలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
విజ్జపురెడ్డి వాటికలో జ్యోతుల అంతిమ ప్రస్థానం…

