ఇంజెక్షన్ వికటించడంతో ఏడుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. కృష్ణ జిల్లా మచిలీపట్నంలోని సర్వజన ప్రభుత్వ ఆస్పత్రి పిల్లల విభాగంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పిల్లల విభాగంలో మొత్తం 15 మందికి వైద్యులు చికిత్స చేస్తున్నారు. శుక్రవారం రాత్రి వైద్యులు చిన్నారులకు రోజువారి ఇంజెక్షన్ చేసారు. ఇంజక్షన్ చేసిన అర గంట తర్వాత 15 మంది చిన్నారుల్లో 7గురికి విపరీతమైన చలి జ్వరం రావడంతో వైద్యులు అప్రమత్తమై క్షణ కాలంలోనే వారిని ఐ.సీ.యూ. కు తరలించారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ సంఘటనపై తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా స్పంధించారు.
వికటించిన ఇంజక్షన్… 7గురు చిన్నారులు అస్వస్థత

