మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. స్థానిక దిండోరిలోని బడ్జార్ ఘాట్ ప్రాంగణంలో ఒక వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. దానితో ఆ వాహనంలో ఉన్నవారిలో 14 మంది మృతి చెందారు. మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని భాదితులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం షాపురా పోటీస్ స్టేషన్ పరిధిలో జరిగినట్లు తెలిపారు. జరిగిన ఘటన పై పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారని అధికారులు తెలిపారు.
వాహనం బోల్త 14 మంది మృతి…
