కర్నూలు జిల్లా హొళగుంద మండలం ప్రజా పరిషత్ కార్యాలయం ముందు వాలంటీర్లు ధర్నా చేపట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్లకు అన్యాయం చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేసారు. నిత్యవసర వస్తువులన్నీ ధరలు పెరిగినా, పని భారాన్ని పేంచారు కానీ వాలంటీర్లకు గౌరవ వేతనం మాత్రం నామమాత్రంగానే ఉందని అన్నారు. వాలంటీర్లు కనీస గౌరవ వేతనం రూ. 18వేలకు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమెండ్ చేసారు. లేకుంటే పెన్షన్ పంపిణీ నిలిపివేసి రాష్ట్ర వ్యప్తంగా ధర్నాలు చేపడతామనిహెచ్చరించారు.
