బెయిల్పై ఉన్న రాజకీయ నాయకుడు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకుండా నిరోధించలేమని సుప్రీంకోర్టు ఇటీవలి ఉత్తర్వుల్లో పేర్కొంది. బెయిల్ మంజూరుకు షరతుగా రాజకీయ కార్యకలాపాలపై నిషేధం విధించడం ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. గత వారం సిబా శంకర్ దాస్ కేసును విచారిస్తున్న న్యాయమూర్తులు బి.ఆర్. గవాయ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఒరిస్సా హైకోర్టు అతనికి విధించిన బెయిల్ షరతును పక్కన పెట్టింది.
అటువంటి షరతు విధించడం అప్పీలుదారు యొక్క ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుందని అటువంటి షరతులు విధించబడడం మేము చూడలేదని పేర్కొన్నారు. కాబట్టి పైన పేర్కొన్న మేరకు హైకోర్టు విధించిన షరతును మేము రద్దు చేసి, పక్కన పెడతామన్నారు. దీని ప్రకారం అప్పీళ్లకు అనుమతి ఉంటుందని ఇటీవల ధర్మాసనం తీర్పునిచ్చింది.

